కొత్త గ్లామర్‌తో వచ్చిన హీరో హోండా 'గ్లామర్' మోటార్‌సైకిల్

Hero Honda Glamour
దేశీయ నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా అందిస్తున్న 125 సీసీ ఇంజన్ బైక్ గ్లామర్‌కు మరింత గ్లామర్‌ను చేర్చి మార్కెట్లోకి విడుదల చేసింది. హీరో హోండా 100-125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది. దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవలే 125 సీసీ వేరియంట్ డిస్కవర్ బైకును ప్రవేశ పెట్టడంతో.. ఈ విభాగంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు హీరో హోండా అందిస్తున్న 125 సీసీ బైక్ గ్లామర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తాజాగా విడుదల చేసింది.

సరికొత్త గ్రాఫిక్స్‌తో ఆకట్టునే లుక్, డిజిటల్ డిస్‌ప్లే, రీడిజైన్‌డ్ స్టిక్కర్స్‌, ఐదు ఆకర్షనీమైన కలర్స్, రీడిజైన్‌డ్ చేయబడిన హెడ్‌ల్యాంప్, రీడిజైన్‌డ్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్, రీడిజైన్‌డ్ సైలెన్సర్ హీట్ షీల్డ్, కొత్త ముఫ్లర్ కవర్, కొత్త వైజర్ మరియు హెడ్‌లైట్ వంటి ఫీచర్లు సరికొత్త గ్లామర్ బైక్ సొంతం. అయితే ఇంజన్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. ఇది ఎయిర్-కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌తో 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 10.35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇకపోతే ముందు డిస్క్ బ్రేక్ కలిగిన గ్లామర్ 125 సీసీ ధర 51,200 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గానూ, ముందు డ్రమ్ బ్రేక్ కలిగిన గ్లామర్ వేరియంట్ ధర 51,200 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గానూ ఉంది. కాగా.. హీరో హోండా అందిస్తున్న స్పోర్ట్స్ వేరియంట్ మోటార్‌సైకిల్ "సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్"లో కూడా కొన్ని మార్పులను చేసి మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, April 27, 2011, 14:48 [IST]
English summary
Hero Honda, the country’s leading two-wheeler manufacturer has revealed a new looking Glamour 125 cc motorcycle. Hero Honda is looking to keep on its dominance in the 100-125cc motorcycle segment space that constitutes the majority of volume in Indian two-wheeler market after the split from Honda from Japan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+