జూన్న నెలలో 20 శాతం పెరిగిన హీరో హోండా విక్రయాలు

Hero Honda
భారతదేశపు నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా విక్రయాలు గత నెలలో కూడా జోరును కొనసాగించాయి. జూన్ 2011లో సంస్థ విక్రయాలు 20 శాతం వృద్ధి చెంది 5,12,244 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి (జూన్ 2010) కంపెనీ విక్రయాలు 4,26,454 యూనిట్లుగా ఉన్న ట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన త్రైమాసికపు మూడు నెలల్లోనూ, ప్రతి నెలా ఐదు లక్షల యూనిట్లకు పైగా కంపెనీ విక్రయాలు నమోదవ్వటం ఇదే మొదటి సారిని, కాగా.. జూన్ నెల విక్రయాలు కూడా ఐదు లక్షల యూనిట్లను అధిగమించడంతో ఈ ఏడాది వరుగా నాలుగో నెలలో కూడా కంపెనీ విక్రయాలు ఐదు లక్షల యూనిట్లను దాటినట్లయిందని హీరో హోండా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అనిల్ దువా తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ మొత్తం విక్రయాలను గమనిస్తే (మూడు నెలల విక్రయాలు కలిపి) కంపెనీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అత్యధిక త్రైమాసిక విక్రయాలు నమోదయ్యాయి. ఏప్రిల్-జూన్ 2011లో హీరో హోండా మొత్తం విక్రయాలు 15,29,577 యూనిట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి 12,34,039 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Saturday, July 2, 2011, 11:17 [IST]
English summary
India's number one two-wheeler manufacturer Hero Honda reported 20.12 per cent growth in its sales for June at 5,12,244 units. The company had sold 4,26,454 units in the corresponding month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+