కొత్త ఇమేజ్‌ కోసం హీరోహోండా ప్రయత్నం

Hero Honda
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరోహోండా నూతన బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగానే ఈ ఏడాది ఆగష్టు9న లండన్‌లో కొత్త పేరును ప్రకటించనున్నామని హీరోహోండా వెల్లడించింది. తమ సంస్థ కోసం కొత్త పేరును అన్వేషించాలని వోల్ఫ్‌ ఆలిన్స్‌ సంస్థతో ఈ ఏడాది మార్చిలో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ క్రమంలోనే వచ్చే నెల 9న ఆ పేరును విడుదల చేస్తామని తెలిపింది. కాగా జపాన్‌కు చెందిన హోండా సంస్థ, భారత్‌కు చెందిన ముంజల్‌ గ్రూప్‌ హీరో సంస్థ రెండు దశాబ్దాలకు పైగా కలిసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఒప్పందం 2014 వరకే ఉండటంతో ఆ తర్వాత తాను కొనసాగలేనని గతేడాది డిసెంబర్‌లో హోండా సంస్థ..హీరో సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న హీరో హోండా సంస్థ ఇకపై కనుమరుగవనుంది. ఈ క్రమంలోనే తమ భవిష్యత్‌ కార్యకలాపాల కోసం కొత్త పేరును పెట్టే పనిలో పడిన హీరో గ్రూప్‌.. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం వచ్చే నెల 9న లండన్‌లో నూతన పేరును ఆవిష్కరించనుంది. ఇదిలావుంటే హీరోహోండాలో కొనసాగుతూనే హోండా మోటార్స్‌ విడిగా దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో హోండా సంస్థకు మళ్శీ పరిచయం అవసరం లేకండా పోయింది.

More from DriveSpark

Article Published On: Sunday, July 24, 2011, 14:42 [IST]
English summary
The country''s largest two-wheeler maker Hero Honda will reveal its much-anticipated global brand identity in London on August 9, as it takes the first major step of establishing its new image after going solo following erstwhile Japanese promoter Honda''s exit.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+