హీరో ఇంపల్స్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్

Hero Impulse
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) తొలిసారిగా హీరో బ్రాండ్ పేరుతో అందిస్తున్న మొట్టమొదటి డ్యూయెల్ పర్పస్ (ఆన్-రోడ్/ఆఫ్-రోడ్) మోటార్‌సైకిల్ 'హీరో ఇంపల్స్' కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ వెబ్‌సైట్‌ను విడుదల చేసింది.

ఈ వెబ్ పేజీని రెండు భాగాలుగా చేసి ఓ వైపు, సిటీ రైడింగ్, మరో వైపు ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడింగ్‌ను ప్రతిబింబించేలా ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దింది. గడచిన ఆగస్టు నెలలో హీరో మోటోకార్ప్ లండన్‌లో తమ కొత్త బ్రాండ్ లోగో ఆవిష్కరణ సందర్భంగా హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.

గత నెలలో (అక్టోబర్ 18)న వాణిజ్యపరంగా హీరో ఇంపల్స్ బైక్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.66,800 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 25, 2011, 11:46 [IST]
English summary
The country's largest two-wheeler maker Hero MotoCorp (formerly known as Hero Honda) has launched a special web page for its first 150cc dual purpose motorcycle Hero Impulse. Hero Impulse produces a maximum power of 13.2 Ps at the rate of 7,500 rpm with a torque of 13.40 Nm at the rate of 5,000 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+