విడిపోయినా, పేరు మారినా జోరు మాత్రం తగ్గలేదు..

గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.505.60 కోట్లుగా ఉంది. అలాగే, కంపెనీ మొత్తం ఆదాయం 27.6 శాతం వృద్ధిని సాధించి రూ.4,630 కోట్ల నుండి రూ.5,909.07 కోట్లకు పెరిగింది. హీరో హోండా జాయింట్ వెంచర్‌లో జపాన్ భాగస్వామి హోండా నుంచి విడిపోయినప్పటికీ తమకు మార్కెట్లో అశేష ఆదరణ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 20.09 శాతం వృద్ధిని సాధించి 15,44,315 యూనిట్లు నమోదు అయ్యాయని, గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఈ అమ్మకాల సంఖ్య 12,85,944 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. హీరో మోటోకార్ప్ ఇది వరకటి త్రైమాసిక ఫలితాల లాభాలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం.
హీరో బ్రాండ్‌పై కస్టమర్లు చూపిస్తున్న విశ్వాసం కారణంగానే తాము ఈ వృద్ధిని సాధించగలిగామని, వాటాదారుల నుంచి కూడా తమకు మంచి మద్దతు లభిస్తోందని సంస్థ చైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ చెప్పారు. గడచిన ఆగస్టు నెలలో తమ బ్రాండ్ లోగో ఆవిష్కరణ సందర్భంగా విడుదల చేసిన 110సీసీ స్కూటర్ 'మాస్ట్రో'ను త్వరలోనే విడుదల చేస్తామని సంస్థ ఎండి పవన్ ముంజాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








