పనిచేసిన మనలోనే హీరో ప్రచారం: ఆగస్టు సేల్స్ అదుర్స్

Hero MotoCorp Sales
ఇటీవలే పేరు మార్చుకుని, ఈ సారి ఒంటరిగా ప్రపంచ వ్యాప్తంగా తన సత్తాను చాటేందుకు సిద్ధమైన భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) తాజాగా చేపట్టిన ప్రచారం (మనలోనే హీరో) కంపెనీ ఉత్పత్తులకు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. హీరో హోండా జాయింట్ వెంచర్‌ నుండి విడిపోయిన తర్వాత ఆగస్టు 9న హీరో తన కొత్త బ్రాండ్ ఇమేజ్‌ను లండన్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

కొత్త లోగోతో పాటుగా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసి "మనలోనే హీరో" అనే థీమ్ సాంగ్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ చేసిన తాజా ప్రచారం కారణంగా ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోనూ విక్రయాలు పెరిగేందుకు దోహదపడినట్లు తెలుస్తుంది. ఆగస్టు 2011 నెలలో కంపెనీ అమ్మకారుల 18 శాతం వృద్ధి చెంది మరోసారి ఐదు లక్షల విక్రయాల మార్కును అధిగమించింది.

ఆగస్టు 2010లో హీరో మోటోకార్ప్ 4,24,617 యూనిట్లను మాత్రమే విక్రయిస్తే, ఆగస్టు 2011లో ఏకంగా 5,03,654 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి హీరో మోటోకార్ప్ ప్రతి నెలా ఐదు లక్షల అమ్మకాల మార్కును అధిగమిస్తూ వస్తుంది. ఒక్క జులై నెలలో మాత్రమే 4,91,036 యూనిట్లను విక్రయించింది. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకూ కంపెనీ మొత్తం అమ్మకాలను గమనిస్తే 25 లక్షల మార్కును అధిమించి 21 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ అమ్మకాలు కేవలం 20,86,342 యూనిట్లుగా మాత్రమే నమోద్యయాని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ మొత్తం 600 లక్షల అమ్మకాల మార్కును అధిగమించాలనే లక్ష్యంతో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, September 2, 2011, 12:33 [IST]
English summary
India's largest two-wheeler maker Hero MotoCorp reported 18.61% jump in its August sales at 5,03,654 units. The company had sold 4,24,617 units in the corresponding month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+