మరోసారి 5 లక్షల సేల్స్ మార్కును అధిగమించిన హీరో

Hero Impulse
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) దేశీయ మార్కెట్లో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తుంది. ప్రతి నెలా ఐదు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. హీరో మోటోకార్ప్ గడచిన నవంబర్ నెల అమ్మకాలలో కూడా ఐదు లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించింది.

గడచిన సంవత్సరం నవంబర్ నెలలో 421,366 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం సంత్సరం నవంబర్ నెలలో 536,772 యూనిట్లను విక్రయించి 27.4 శాతం వృద్ధిని సాధించింది.5.12 లక్షల యూనిట్లను విక్రయించింది. పరిశ్రమలో తమ అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, బెంచ్‌మార్క్‌లను స్థాపిస్తున్నాయని, తమ కొత్త బ్రాండ్ ఐడెంటిటీ ప్రారభించినప్పటి నుండి (ఆగస్టు 2011 నుండి) ప్రతి నెలా ఐదు లక్షలకు యూనిట్లను విక్రయిస్తూ వస్తున్నామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు.

కాగా.. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలం నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు 19.6 శాతం వృద్ధిని సాధించి 41,22,902 యూనిట్లను విక్రయించగా గడచిన సంవత్సరం ఇదే కాలానికి ఇవి 34,46,602 యూనిట్లుగా ఉన్నాయి. తరచూ కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, నెట్‌వర్క్ విస్తరణపై దృష్టిసారిస్తామని ఆయన చెప్పారు. కంపెనీ ఇటీవలే తమ 150సీసీ బైక్ హీరో ఇంపల్స్‌ను విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, December 2, 2011, 10:39 [IST]
English summary
India's largest two-wheeler maker Hero MotoCorp (erstwhile Hero Honda) continued its brisk monthly sales of 500,000 two-wheeler segment. Hero MotoCorp November sales up 27.4 per cent which stood at 536,772 units as against 421,366 units sold in the like period of 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+