అత్యధిక నెలవారీ అమ్మకాలు నమోదుచేసుకున్న హీరో

Hero Sales
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ద్విచక్ర వాహన అమ్మకాలలో మరోసారి తన సత్తా నిరూపించుకుంది. గడచిన సెప్టెంబర్ నెలలో దేశంలో ఏ కంపెనీ విక్రయించనంతగా.. అత్యధిక నెలవారీ విక్రయాలను కంపెనీ నమోదు చేసుకుంది. సెప్టెంబర్ 2011లో కంపెనీ 5,49,625 యూనిట్లను విక్రయించి 26.75 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 4,33,641 యూనిట్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ హీరో మోటోకార్ప్ విక్రయించిన నెలవారీ అమ్మకాల్లో ఇదే అత్యధికమని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలానికి గానూ అమ్మకాలు 20.09 శాతం వృద్ధి చెంది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 12,85,944 యూనిట్ల నుండి 15,44,315 యూనిట్లకు పెరిగాయి.

సెప్టెంబర్ నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసుకోవడం ద్వారా కంపెనీ మరో మైలురాయిని అధిగమించిందని, కొత్త కంపెనీ ఏర్పడినప్పటి నుండి ప్రతి నెలా అమ్మకాలు ఐదు లక్షలకు పైగా నమోదవుతున్నాయని, ద్విచక్ర వాహన మార్కెట్లో తమ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగిస్తామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, October 3, 2011, 15:46 [IST]
English summary
India's largest two-wheeler maker Hero MotoCorp reported highest ever monthly sales of 5,49,625 units in September, registering a growth of 26.75 per cent. The company had sold 4,33,641 units in the same month last year, Hero MotoCorp said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+