భారత్‌లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న హీరో

"రెండు ప్లాంట్ల ఏర్పాటును ప్రకటించనున్నాం. ఇందులో ఒకటి దక్షిణాదిలోనూ మరొకటి పశ్చిమ ప్రాంతంలో ఉండబోతుంద"ని ఆయన చెప్పారు. అయితే, ఇప్పటి వరకూ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను గుర్తించలేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్రాంతాలు మరియు పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తామని దువా తెలిపారు.
అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. హీరో మోటోకార్ప్ కూడా గుజరాత్ రాష్ట్రాన్నే ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 61.5 లక్షల యూనిట్లుగా ఉంది. త్వరలోనే దీన్ని 64-65 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని, మరో 5-6 ఏల్లలో ఏటా కోటి వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కంపెనీ ముడిసరుకుల భారం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాహన ధరలను పెంచే యోచనలో లేమని అనిల్ దువా అన్నారు.


Click it and Unblock the Notifications








