హీరో రణ్‌బీర్ కపూర్ ప్రచారం ఫలిస్తేనే.. టార్గెట్ సాధ్యం..!

రూ.66,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో లభ్యమవుతున్న ఈ బైక్‌ను ప్రతి నెలా కనీసం 1,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రోజూవారీ ప్రయాణ అవసరంలో భాగంగా ఇటు ఆన్-రోడ్ రైడింగ్ కోసం.. అలాగే కొండలు, లోయలు వంటి ప్రాంతాల్లో అడ్వెంచర్ ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం ఉపయోగించుకునేలా హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ రూపొందించి. ఈ బైక్‌కు హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
ఇప్పుడే ఈ బైక్‌ను ప్రవేశపెట్టినందు వల్ల దీని అమ్మకాలపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం లేదని, టైర్-2, టైర్-3 మార్కెట్లపై పెద్దగా అంచనాలు లేవని హీరో మోటోకార్ప్ వైస్-ప్రెసిడెంట్ (మార్కట్ అండ్ సేల్స్) అనీల్ దువా తెలిపారు. 110సీసీ స్కూటర్ 'హీరో మాస్ట్రో' వచ్చే నెలలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం హోండా అందిస్తున్న ఏవియేటర్ స్కూటర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మ్యాస్ట్రో స్కూటర్ డిజైన్ చేసినట్లు సమాచారం.
భవిష్యత్తులో హోండా టెక్నాలజీ కూడిన మరిన్ని వాహనాలను హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్ పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీరో అందిస్తున్న ప్లెజర్ స్కూటర్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ మోడల్ ఉత్పత్తిని ప్రతి నెలా 25,000 యూనిట్ల నుండి 50,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. మరి హీరో ఇంపల్స్ సేల్స్ టార్గెట్‌ను కంపెనీ చేరుకోవాలంటే.. హీరో రణ్‌బీర్ కపూర్ క్యాంపైన్ ఫలించాల్సి ఉంది..!!


Click it and Unblock the Notifications








