కొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

ఈ రోజు నుంచి తాము కొత్త జీవితాన్ని ప్రారంభించామని, రెండున్నర దశాబ్ధాలకు పైగా కోట్లాది మంది వినియోగదారులతో అత్యంత విశ్వసనీయంగా మెలిగామని, భవిష్యత్తులో కూడా అంతకు మించిన పనితీరు కనబరుస్తామని కంపెనీ చైర్మన్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ తెలిపారు. ఇకపై తాము విడుదల చేయబోయే కొత్త బైక్‌లన్నింటినీ హీరో మోటో బ్రాండ్‌పైనే విడుదల చేస్తామని ఆయన అన్నారు.
కాగా.. ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. హీరో మోటోకార్ప్ కంపెనీ కొత్త కొత్త థీమ్ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరకల్పన చేశారు. 'హమ్ మే హై హీరో' (మనలోనే ఉన్నాడు హీరో) అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌ను ప్లే చేస్తూ కంపెనీ కొత్త లోగోను ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications








