విదేశీ మార్కెట్లలో తొలి అడుగులు వేస్తున్న 'హీరో మోటార్స్'

హీరో మోటార్స్ పరిశీలిస్తున్న పై మూడు మార్కెట్లు కూడా అత్యంత పటిష్టమైన వృద్ధితో ఎదుగుతున్నాయి. తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేయడంలో ఉన్న తనకున్న అనుభవాన్ని హీరో మోటార్స్ ఈ మార్కెట్లో కూడా ఉపయోగించాలని భావిస్తోంది. ఈ మూడు ఎగుమతుల మార్కెట్లు అధిక పరిమాణాన్ని మరియు అధిక సంఖ్యలో ప్రయాణికులను కలిగి ఉన్నవని, ఇక్కడ తాము సులువుగా విజయం సాధించగలమని భావిస్తున్నట్లు హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీల్ దువా వెల్లడించారు. హోండాతో పోటీ విషయాన్ని అలా ఉంచితే, అంతకన్నా ముందుగా.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో రాణిస్తున్న బజాజ్, టీవీఎస్‌ల నుంచి హీరో మోటార్స్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








