గ్రాండ్ ప్రిలో నరైన్ కార్తికేయన్‌ స్పాన్సర్‌గా హీరో మోటార్స్

Narain Karthikeyan
భారతదేశపు ప్రముఖ వాణిజ్య సంస్థ హీరో మోటార్స్ లిమిటెడ్, ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేశంలోనే మొట్టమొదటిసారిగా జరగనున్న ఫార్ములా వన్ కార్ రేస్ ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి ఆఫ్ ఇండియాలో పాల్గొనున్న ప్రముఖ ఇండియన్ ఎఫ్1 డ్రైవర్ నరైన్ కార్తికేయన్ మరియు అతని టీమ్‌కు స్పాన్సరింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ గ్రాండ్ ప్రికు సంబంధించి టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ల ద్వారా విక్రయించడం కూడా జరుగుతోంది.

ఈ సందర్భంగా హీరో మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ మాట్లాడుతూ.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో పోటీపడుతున్న తొలి ఇండియన్ కార్పోరేట్ హౌస్ తమదేనని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామ ని అన్నారు. ఈ రేసులో నరైన్ కార్తికేయన్ మరియు హిస్పానియా రేసింగ్ టీమ్ (హెచ్ఆర్‌టి)తో కలిసి పనిచేయడం తమకెంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.

ఎంతో మంది ఎఫ్1 ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ప్రి ఎఫ్1 రేస్ ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకూ గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. ఈ స్పాన్సర్‌షిప్‌లో భాగంగా గ్రాండ్ ప్రిలో పాల్గొనే నరైన్ యొక్క రేసింగ్ కార్లపై హీరో మోటార్స్ తన లోగోను ప్రదర్శించుకునేందుకు అంగీకరించింది. ఫార్ములా వన్ రేస్ ప్రభావంతో ఢిల్లీలో ఎన్నడూలేని విధంగా హోటళ్లన్ని ఇప్పటి నుండే హౌస్‌ఫుల్ బోర్డును పెట్టేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 2, 2011, 17:56 [IST]
English summary
Hero Motors Limited, India’s one of the largest & fastest growing business conglomerates with diversified business verticals announces association with ace F1 driver Narain Karthikeyan and his Formula One team. Hero Motors will be sponsoring Narain Karthikeyan and his team for the inaugural Formula One Grand Prix to be held in India in October this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+