హోండా వాటా కొనుగోలుపై రూ. 811 కోట్లు పన్ను చెల్లించిన హీరో

Hero Honda
బిఎమ్ ముంజాల్ ప్రమోట్ చేసిన హీరో గ్రూప్ తన జపాన్ భాగస్వామి హోండా వద్ద కొనుగోలు చేసిన వాటాలపై రూ. క్యాపిటల్ గెయిన్ టాక్స్‌కు గానూ రూ. 811 కోట్ల పన్ను చెల్లించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) పేర్కొంది. "పూర్తి మొత్తం రూ. 811 కోట్లను హీరో రెండు విడతలలో చెల్లింది. మొదటి విడదతలో భాగంగా మార్చి నెలలో రూ. 100 కోట్లను, ఏప్రిల్ నెలలో రెండవ విడత కింద రూ. 711 కోట్లను అధిక రేట్ 22 శాతం వద్ద చెల్లించింది. వాళ్లు ఎలాంటి రాయితీని కోరలేద"ని సిబిడిటి అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి విడిపోయేందుకు హీరో గ్రూప్, హోండా కంపెనీకు చెల్లించిన మొత్తానికి గానూ ఇది క్యాపిటల్ గెయిన్ టాక్స్ అని ఆయన వివరించారు. గతేడాది డిసెంబర్ నెలలో హీరో హోండా జేవీ నుంచి ఇరు సంస్థలు విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో హోండా జాయింట్ వెంచర్‌లో హోండాకు ఉన్న 26 శాతం వాటాలను హీరో గ్రూప్ రూ. 3,841.83 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ జాయింట్ వెంచర్ 26 ఏళ్ల క్రితం ఏర్పడింది. ప్రస్తుతం సరైన సాంకేతిక భాగస్వామి కోసం హీరో గ్రూప్ ముమ్మరంగా గాలింపులు ప్రారంభించింది.

More from DriveSpark

Article Published On: Friday, July 15, 2011, 11:47 [IST]
English summary
Munjal family promoted Hero Group has paid Rs. 811 crore as capital gains tax for buying out erstwhile partner Honda from their joint venture, Hero Honda, Central Board of Direct Taxes (CBDT) spokesperson told media.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+