హీరో హోండా బ్రాండ్ పేరుతో పాటు.. కంపెనీ పేరును కూడా చేంజ్!?

Hero Moto Corp Ltd
జపాన్ కంపెనీ హోండా మోటార్స్ భాగస్వామ్యం నుంచి విడిపోయిన తర్వాత ముంజాల్‌ కుటుంబానికి చెందిన హీరో గ్రూపు దేశీయ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు భారీ కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో 'హీరో హోండా' కొత్త బ్రాండ్‌కు పేరును పరిశీలిస్తున్న హీరో గ్రూపు బ్రాండ్ పేరుతో పాటుగానే కంపెనీ పేరును కూడా మార్చాలని భావిస్తోంది. హీరో హోండా పేరులో 'హోండా' అని ఉన్నప్పటికీ అది జపాన్ కంపెనీ పేరు కావడంతో దాని స్థానంలో మరేదైన కొత్తపదాన్ని చేర్చాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ మేరకు హీరో హోండా కొత్త బ్రాండ్ నేమ్‌ను 'హీరో మోటో' గానూ, అలాగే బ్రాండ్ పేరుతో పాటుగానే.. ప్రస్తుతం 'హీరో హోండా మోటార్స్ లిమిటెడ్'గా ఉన్న కంపెనీ పేరును కూడా 'హీరో మోటో కార్పోరేషన్ లిమిటెడ్'గా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా.. ఇరు కంపెనీల జాయింట్ వెంచర్ నిష్క్రమణల ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. ఇక ఇందులో చివరి అంఖం బ్రాండ్ నేమ్‌పై కంపెనీల షేర్‌హోల్డర్ల తుదినిర్ణయం మాత్రమే మిగిలి ఉంది. దీన్ని ఖరారుపై ముంజాల్ ప్రమోట్ చేసిన హీరో గ్రూప్ జూన్ 17న షేర్‌హోల్డర్ల సమావేశాన్ని హరిద్వార్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడే కంపెనీ మూడో ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం... రీ బ్రాండింగ్ కోసం హీరో గ్రూపు 200 కోట్ల రూపాలను ఖర్చు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 25, 2011, 15:16 [IST]
English summary
India’s largest two-wheeler maker Hero Honda Motors Ltd, which recently split with from Japanese's partner Honda is planning to change its Brand and Company name as soon as possible. Reports says that Brand name is likely to be known as ‘Hero Moto' and Company name might be 'Hero Moto Corp Ltd', according to a company filing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+