కొత్త శ్రేణి రిక్షాలను విడుదల చేసిన హై బర్డ్

Hi Bird Rickshaw
రిమ్ జిమ్.. రిమ్ జిమ్.. హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరిగిర తిరిగితే మోటార్‌సైకిలే బలాదూర్ అంటూ... పాత తెలుగు సినిమాలో 'చలం' రిక్షా యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అయితే కాలం మారింది, రిక్షాలు పోయి ఆటోలు వచ్చాయి. కానీ, పొట్టకూటి కోసం రిక్షా తొక్కేవాళ్లు మాత్రం ఆటోలు కొనుక్కునేంత స్థోమత లేక, రిక్షాలకు బేరాలు రాక విలవిలలాడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో మరుగున పడిపోతున్న మూడు చక్రాల సైకిల్ రిక్షాలకు పూర్వవైభవం కల్పించాలనే లక్ష్యంతో మరియు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కలిగించేలా ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ హై బర్డ్ కొత్త శ్రేణి రిక్షాలను విడుదల చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ రిక్షాలను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 రిక్షాలను విక్రయించాలని హై బర్డ్ లక్ష్యంగా నిర్ణయించినట్లు కంపెనీ చైర్మన్ ఆర్‌డి శర్మ వెల్లడించారు.

రిక్షా లాగేవారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రిక్షాను తొక్కేందుకు కావల్సిన శక్తిని తగ్గించేందుకు గానూ రిక్షా బరువు 30 శాతానికిపైగా తగ్గించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సాధారణ రిక్షాల బరువు దాదాపు 100 కిలోలు ఉంటే, కొత్తగా విడుదల చేసిన రిక్షా బరువు 65-75 కిలోలు ఉంటుందని శర్మ వివరించారు. ఇంకా ప్రయాణికుల రక్షణ కోసం కార్లలో మాదిరిగా సీట్‌ బెల్ట్‌ను ప్రయాణికుల ఫుట్ రెస్ట్ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఈ రిక్షాలకు జోడించారు.

ఇక ఈ రిక్షాల ధర విషయానికి రూ. 8,500 మొదలుకొని రూ. 15,000 వరకూ ఉన్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లు రిక్షాల పటిష్టమైన మార్కెట్లని, రెండవ విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలలో విడుదల చేస్తామని శర్మ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రిక్ష మార్కెట్ పరిమాణం రెండు కోట్లని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. లుథియానాకు చెందిన ఓ కంపెనీ డయల్-ఏ-క్యాబ్ లాంటి కారు సర్వీసు మాదిరగా 'డయల్-ఏ-రిక్షా' సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2011, 12:53 [IST]
English summary
India's leading Bicycle maker Hi Bird on Monday launched its new range of rickshaws in Punjab, Haryana and Rajasthan. The Company is aiming to sell 10,000 units in the current fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+