ఈ-బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన హై-బర్డ్ సఫారీ గ్రూప్

E Motorcycles
ఛంఢీఘడ్: లుథియానాకు చెందిన సైకిల్ తయారీ సంస్థ "హై-బర్డ్ సఫారీ గ్రూప్" ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. 600 కోట్ల రూపాయల విలువ గల ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో ఏటా 10,000 ఈ-బైక్‌లను విక్రయించాలనే లక్ష్యంతో కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తుంది. గో-గ్రీన్ లక్ష్యంగా వాహన కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హై-బర్డ్ సఫారీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌డి శర్మ వెల్లడించారు.

ఈ-బైక్‌లపై కేంద్రం ప్రభుత్వం అద్భుతమైన రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తుండటంతో.. కంపెనీ ఈ-బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించిందని శర్మ వివరించారు. ఇటీవల కేంద్రం వెల్లడించిన యూనియన్ బడ్జెట్ 2011-12లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ దిగుమతి చేసుకునే బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా మినహాయించడమే కాకుండా.. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో కూడా రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ-బైక్‌ల తయారీకి కావల్సిన ఇంజన్ మరియు ఇతర కీలక విడిభాగాలను కొరియా, తైవాన్‌ల నుంచి దిగుమతి చేసుకొని లుథియానాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో హై-బర్డ్ అసెంబ్లింగ్ చేయనుంది. ఈ ద్విచక్ర వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పూర్తి బ్యాటరీ ఛార్జింగ్‌పై 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా వీటిని రూపొందించనుంది. రెండు మోడళ్లలో విడుదల చేయబోయే వీటి ధరలు రూ. 27,000 మరియు రూ. 28,900 మధ్య ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, March 28, 2011, 17:20 [IST]
English summary
Ludhiana-based cycle maker Hi-Bird Safari Group said its foray into the electronic two-wheelers market. Company is aiming to sell 10,000 e-bikes per year. The incentives offered by the Centre on e-bikes encouraged the company to enter the e-bike market, Hi-Bird Safari Group Managing Director R D Sharma said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+