ఏవియేటర్, సిబిఎఫ్ స్టన్నర్‌లలో కొత్త వేరియంట్లు: హోండా

New Aviator
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ప్రస్తుతం అందిస్తున్న ఏవియేటర్ (స్కూటర్) మరియు సిబిఎఫ్ స్టన్నర్ (మోటార్‌సైకిల్) మోడళ్లలో మూడు కొత్త వేరియంట్లను సోమవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హీరో హోండా (ప్రస్తుతం హీరో మోటోకార్ప్) జాయింట్ వెంచర్ నుంచి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హోండా భారీ కసరత్తులే చేస్తుంది.

ఇందులో భాగంగానే, 102 సీసీ ఏవియేటర్ స్కూటర్‌లో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.45,300 మరియు రూ.50,400 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. అలాగే, కొత్త 125 సీసీ సిబిఎఫ్ స్టన్నర్ ధర రూ.54,509 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెలాఖరు నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ షోరూమ్‌లో ఈ మూడు కొత్త వేరియంట్లు లభ్యం కానున్నాయని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా, భారతీయ వినియోగదారుల అవసరాలను అందుకునే విధంగా హోండా తన ఉత్పత్తులను విస్తరిస్తుందని, కొత్త ఏవియేటర్ మరియు కొత్త సిబిఎఫ్ స్టన్నర్‌లు తాజా లుక్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటాయని హెచ్ఎమ్ఎస్ఐ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) ఎన్‌ కె రత్తన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. కొత్త ఏవియేటర్ సరికొత్త లుక్‌ను కలిగి ఉండటమే కాకుండా పాత వేరియంట్ కన్నా 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది బెర్రీ పర్పల్ మరియు సన్‌బీమ్ వైట్ అనే రెండు కొత్త ఆకర్షనీయ రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2011, 8:44 [IST]
English summary
Japaneese two-wheeler maker Honda Motorcycle & Scooter India (HMSI) launched two new versions of its scooter Aviator and one new version of its 125cc motorcycle CBF Stunner. The 102 cc New Aviator has been launched in two variants and will be priced at Rs 45,300 and Rs 50,400, respectively. The new version of the 125 cc CBF Stunner will come for Rs 54,509.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+