100 సీసీ మోటార్ సైకిల్ విభాగంపై హోండా కన్ను

Honda CB
హీరో హోండా కంపెనీ నుంచి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో తన సత్తాను నిరూపించుకునేందుకు.. అలాగే హీరో గ్రూపు నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) భారీ కసరత్తులు చేస్తుంది. హీరో హోండా జాయింట్ వెంచర్ హీరో గ్రూప్, హోండా మోటార్‌ అనే రెండు కంపెనీలుగా విడిపోతున్న సంగతి తెలిసిందే. హోండా ప్రస్తుతం 150 సీసీ విభాగంలో యునికార్న్‌ను, 100 సీసీ విభాగంలో సిబి ట్విస్టర్‌ను అందిస్తుంది. అయితే తాజాగా... హోండా కంపెనీ 100 సీసీ విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇందుకు ముఖ్య కారణం హీరో హోండా ఇప్పటికే 100 సీసీ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతని పొందిన సంగతి తెలిసిందే. హీరో హోండా కంపెనీ 100 సీసీ విభాగంలో స్ప్లెండర్, ప్యాషన్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లు కంపెనీకు రెండు కళ్ల లాంటివి. వీటికి పోటీగా ఎన్ని మోటార్‌సైకిళ్లు వచ్చినప్పటికీ పోటీని తట్టుకోలేక వెనుకబడిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కసారి ఈ జాయింట్ వెంచర్ నుంచి హోండా వేరుపడిన మార్కెట్ తర్వాత పోటీని తట్టుకోవాలంటే తమ ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోక తప్పదు. ఈ నేపథ్యంలో హోండా 100 సీసీ విభాగంలో మెరుగైన, అధిక మైలేజ్‌తో తక్కువ ధరకే లభించేలా ఓ బైక్‌ను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. వచ్చే నెలలో ఈ హోండా 100 సీసీ బైక్ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2011, 17:52 [IST]
English summary
After separating from Hero Honda, the Japan based two-wheeler manufacturer Honda Motor company is planning expand their product portfolio in Indian market. Now Honda Motorcycles & Scooters India Limited is eying in 100 cc bike segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+