రెండేళ్లలో రెండో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం: హోండా

Honda Brio
జపాన్ ఆటో దిగ్గజం హోండా రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంటులో ఉత్పత్తిని మరో రెండు-మూడేళ్లలో ప్రారంభించవచ్చునని అంచనా వేస్తోంది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన మాంద్యం ఈ ప్లాంటుపై ప్రభావాన్ని చూపింది. భారత్‌లోని సియోల్ గ్రూపుతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి కార్యకలాపాలు కొనసాగిస్తున్న హోండా 2008లో తపుకరా ప్లాంటులో పాక్షికంగా విడిభాగాల ఉత్పత్తిని చేపట్టింది.

ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడమే తమ ప్రధమ లక్ష్యమని, ఆ తర్వాతనే తపుకరా ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలను ప్రారభించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని, ఇందుకు మరో 2-3 ఏళ్ల సమయం పడుతుందని హోండా సియోల్ కార్స్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) సెకీ ఇనాబా అన్నారు.

గ్రేటర్‌ నోయిడాలో రూ. 450 కోట్ల పెట్టుబడితో 1997లో హోండా తొలి ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని ఉత్పత్తి సామర్థ్యం సాలీనా ఒక లక్ష యూనిట్లు. వివిధ మార్గాలలో సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఈ ప్లాంటులో ఏటా 1.2 లక్షల యూనిట్ల వరకూ ఉత్పత్తిని చేపట్టవచ్చునని ఆయన చెప్పారు. కాగా.. రాజస్థాన్‌లోని తపుకరాలో ఏర్పాటు చేసింది భారత్‌లో హోండా కంపెనీకు రెండవ ప్లాంటు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 23, 2011, 15:40 [IST]
English summary
Honda Siel Cars India expects to start vehicle production in its second plant at Tapukara, in Rajasthan. Company senior official said, vehicles may start rolling out within the next 2-3 years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+