అధిక మైలేజీనిచ్చే బైక్‌లను ప్రవేశపెట్టనున్న హోండా

త్వరలోనే హోండా ఈ బైక్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ప్రస్తుతం హోండా అందిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే మోటార్‌సైకిల్ సిబి ట్విస్టర్ 110సీసీ (కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, లీటరు పెట్రోల్‌కు 70 కి.మీ.)కు దిగువన ఓ సరికొత్త బైక్‌ను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రవేశపెట్టనుంది.
ప్రపంచ మార్కెట్లలో ద్విచక్ర వాహన విభాగంలో హోండాకు పెద్ద వాటా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో మాత్రం నాల్గవ స్థానంలో ఉంది. ఈ మార్కెట్‌ను తాము సవాల్‌గా తీసుకుంటున్నామని, భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అందిచాలనుకుంటున్నామని, రానున్న రోజుల్లో మంచి ఇంధన సామర్థ్యం కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందిస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








