జనవరిలో 100సీసీ బైక్‌ను ఆవిష్కరించనున్న హోండా

Honda 100cc Bike
జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ యొక్క పూర్తి భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా మోటార్‌‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఓ కొత్త 100 సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో హోండా ఇప్పటి వరకూ 100 సీసీ సెగ్మెంట్లో ద్విచక్ర వాహనాలను అందిచండం లేదు.

హీరో మోటోకార్ప్ అందిస్తున్న స్ప్లెండర్, ప్యాషన్ బ్రాండ్‌లకు పోటీ ఇచ్చేందుకు రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ధర కలిగి ఉండేటట్లుగా ఓ కొత్త 100 సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు హోండా పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో తమ 100 సీసీ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచుతాని, రానున్న ఆర్థిక సంవత్సరం నాటికి దీన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌ కె రత్తన్‌ చెప్పారు.

ప్రస్తుతం కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో హోండా యునికార్న్, యునికార్న్ డాజ్లర్, సిబి ట్విస్టర్, సిబిఎఫ్ స్టన్నర్ మోటార్‌సైకిళ్లను మరియు స్కూటర్ సెగ్మెంట్లో ఆక్టివా, ఏవియేటర్ మోడళ్లను అందిస్తోంది. భారత్‌లోని టాప్ 3 ద్విచక్ర వాహన కంపెనీలలో తాను ఒకటిగా నిలవాలని హోండా లక్ష్యంగా పెట్టుంది. ఈ నేపథ్యంలో తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా కంపెనీ ఉత్పత్తి మరియు ఉత్పత్తుల విస్తరణను చేపట్టింది.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 10:42 [IST]
English summary
Honda Motors, the Japanese two wheeler manufacturer has revealed plans to launch a 100cc motorcycle in India by early 2013. The company which split from long term partner Hero currently does not have a 100cc motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+