ద్విచక్ర వాహన రంగంలో నెంబర్ వన్ స్థానానికి రావాలన్నదే మాకోరిక..

అంతే కాదు జులై-ఆగస్టు నుంచి కార్యకలాపాల్లోకి రానున్న రాజస్థాన్‌లోని రెండో ప్లాంటు కోసం 1500 మందిని నియమించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమికంగా ఏటా 6 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో మొదలు పెట్టే ఈ ప్లాంటును తర్వాత 12 లక్షల యూనిట్ల సామర్థ్యం వరకూ విస్తరించే అవకాశం ఉంది. ఇక భారత్‌లో మూడో ప్లాంటు ఏర్పాటు నిర్ణయాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. 2010-11లో మొత్తం మీద 16.5 లక్షల వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్లు ఆయోమా వివరించారు. 2011-12లో 21 లక్షల వాహనాలను విక్రయించడం ద్వారా 27 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








