రాష్ట్ర మార్కెట్లో హోండా సిబిఆర్ 250ఆర్ విడుదల

Honda CBR 250R ABS
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లో అందిస్తున్న హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్ 'హోండా సిబిఆర్‌ 250ఆర్‌'ను శుక్రవారం రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హోండా అందిస్తున్న సూపర్ స్పోర్ట్స్ బైక్స్ వీఎఫ్‌ఆర్ 1200ఎఫ్, సీబీఆర్ 1000ఆర్‌ఆర్‌ మోడళ్ల డిజైన్‌ను అనుసరించి సిబిఆర్ 250ఆర్‌ బైక్‌ను రూపొందించారు.

ఇది 249సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో లభిస్తుంది. కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్‌ మరియు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ అనే రెండు వేరియంట్లతో మూడు ఆకర్షనీమైన రంగుల్లో ఈ స్పోర్ట్స్ బైక్ అందుబాటులో ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్స్, శీతల వాతావరణంలోనూ త్వరగా స్టార్ట్ అయ్యేలా ఇందులో పొందుపరచిన పీజీఎమ్-ఎఫ్‌ఐ టెక్నాలజీ మరియు ఏబిఎస్ టెక్నాలజీ అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పటికీ వాహనం జారిపోకుండా ఉండటం దీని అనదపు ప్రత్యేకత.

ఏబిఎస్ వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.1.90 లక్షలు, నాన్ ఏబీఎస్ రూ.1.62 లక్షలుగా ఉంది. ఈ బైక్‌కు ఇప్పటికే దక్షిణ భారతదేశం నుంచి 2000 యూనిట్ల కోసం ఆర్డర్లు రాగా.. ఒక్క మన రాష్ట్రం నుంచే 600 యూనిట్ల కోసం ఆర్డర్లు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. హోండా సిబిఆర్ 250ఆర్ బుక్ చేసుకున్న తర్వాత డెలవరీకు నాలుగు నెలల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2011, 16:35 [IST]
English summary
Japanese two-wheeler major Honda Motor Company's 100 per cent owned Indian subsidiary Honda Motorcycle & Scooters India (HMSI) launched its high-end sports bike Honda CBR 250R in Hyderabad. The standard and C-ABS variants are priced at Rs 1.47 lakh and Rs 1.73 lakh (ex-showroom Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+