భారత్‌లో మూడవ ప్లాంటు పనులను ప్రారంభించిన హోండా

బెంగుళూరుకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో 3,50,000 చ.మీ. విస్తీర్ణంలో సుమారు రూ.1,350 కోట్ల పెట్టుబడితో హోండా ఈ ప్లాంటును నిర్మిస్తోంది. 2013 నాటికి ఈ ప్లాంటు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో భాగంగా సాలీనా 12 లక్షల యూనిట్లను ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ కీటా మౌరమత్సు తెలిపారు.
భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 18 లక్షల యూనిట్లకు పెంచుతామని, ఈ ప్లాంటు ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం, భారత మార్కెట్లో హోండా మూడు స్కూటర్ల (ఆక్టివా, డియో, ఏవియేటర్)ను, ఆరు మోటార్‌సైకిళ్ల (సిబి ట్విస్టర్, సిబిఎఫ్ స్టన్నర్, సిబి షైన్, సిబి యునికార్న్, సిబి యునికార్న్ డాజ్లర్ మరియు సిబిఆర్ 250ఆర్)ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








