80 లక్షల సేల్స్ మార్కును అధిగమించిన చేసిన హోండా

Honda CB Unicorn
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) మరో అరుదైన రికార్డును సాధించింది. గడచిన 11 ఏళ్ల క్రితం భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ జపాన్ కంపెనీ 80 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించి సరికొత్త మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హోండా కంపెనీ ఉత్పత్తి విస్తరణపై మరియు ఆకర్షనీయమైన ధరలకే రెండు కొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

కాగా.. 2010-12 నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు 21 లక్షల యూనిట్లను తాకాలనే లక్ష్యంతో హెచ్ఎమ్ఎస్ఐ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హోండాకు హర్యానాలోని మానేసర్ మరియు రాజస్థాన్‌లోని తపుకరాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. తపుకరాలో ఏర్పాటు చేసిన రెండో ప్లాంటులో కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. మార్చి 2012 నాటికి ఎగుమతలను సామర్థ్యాన్ని 12 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

అంతేకాకుండా కంపెనీ తన మూడో ప్లాంటు ఏర్పాటుకు బెంగుళూరును కేంద్రంగా ఎంచుకుంది. 2013 ప్రధమార్థం నాటికి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. ఈ ప్లాంటును సాలీనా 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ప్లాంటు పూర్తిగా నిర్వహణలోకి వస్తే.. హోండా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 40 లక్షల యూనిట్లకు పెరుగుతుంది. కాగా.. 100 సీసీ విభాగంలో హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) మోడళ్ళకు చెక్ పెట్టేందుకు కంపెనీ ఓ కొత్త బైక్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2011, 10:32 [IST]
English summary
Japanese two-wheeler maker Honda's wholly-owned Indian subsidiary Honda Motorcycle & Scooter India (HMSI) has surpassed the 80 lakh two-wheeler sales mark in 11 years of operations, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+