జులైలో 10 శాతం పెరిగిన హోండా మోటార్‌సైకిల్ సేల్స్

Honda Two-wheeler Sales
ఓ వైపు దాదాపు అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు జులై అమ్మకాలలో దూసుకుపోతుంటే జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మాత్రం నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జులై 2011లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 10 శాతం మాత్రమే వృద్ధి చెందాయి.

జులై 2011లో హోండా ద్విచక్ర వాహన అమ్మకాలు 1,52,382 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 1,38,445 యూనిట్లుగా ఉన్నట్లు హెచ్ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. జులై 2011లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2 శాతం క్షీణించి 60,740 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 61,769 యూనిట్లుగా ఉన్నాయి. హోండా 150 సీసీ సెగ్మెంట్లో అందిస్తున్న 'సిబి యునికార్న్' వెయిటింగ్ పీరియడం ఆరు నెలలకు పెరగడంతో ఇది కంపెనీ విక్రయాలపై ప్రభావాన్ని చూపింది.

అయితే, స్కూటర్ల సెగ్మెంట్లో మాత్రం అమ్మకాలు ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచాయి. గత నెలలో హోండా స్కూటర్ అమ్మకాలు 20 శాతం పెరిగి 91,642 యూనిట్లుగా నమోదయ్యాయి. జులై 2010లో స్కూటర్ అమ్మకాలు 76,676 యూనిట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా హోండా ఆక్టివాకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 2, 2011, 12:54 [IST]
English summary
Japanese two-wheeler manufacturer Honda Motorcycle & Scooter India (HMSI) reported 10% growth in sales at 1,52,382 units in July, 2011. The company sold 1,38,445 units in the corresponding month of the previous year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+