మే నెల విక్రయాలలో 6 శాతం వృద్ధిని సాధించిన హోండా

Honda Motorcycles
భారతదేశపు నాలుగో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) గత నెల విక్రయాలు స్వల్పంకా తడబడి 6 శాతం వృద్ధిని సాధించాయి. మే 2011లో కంపెనీ విక్రయాలు 1,45,729 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకు ముందు ఇదే సమయానికి కంపెనీ అమ్మకాలు 1,37,842 యూనిట్లుగా ఉన్నాయి. మే 2011లో కేవంల మోటార్‌సైకిల్ విక్రయాలను మాత్రమే గమనిస్తే అవి 16 శాతం వృద్ధి చెంది 60,040 యూనిట్ల నుంచి యూనిట్లకు పెరిగాయి. అయితే ఇదే కాలానికి స్కూటర్ల విక్రయాలు మాత్రం 2 శాతం క్షీణించి 77,802 యూనిట్ల నుంచి 76,241 యూనిట్లకు పడిపోయాయి.

అలాగే... భారతదేశపు మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా మే నెల విక్రయాలలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. మే 2011లో కంపెనీ 18 శాతం విక్రయ వృద్ధితో సర్ధుకుంది. గత నెలలో టీవీఎస్ మొత్తం 1,85,930 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ విక్రయాలు 1,54,667 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహన అమ్మకాలు 1,54,667 యూనిట్ల నుంచి 181,891 యూనిట్లకు పెరిగి 18 శాతం వృద్ధిని నమోదు చేయగా, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలు 42 శాతం పెరిగి 26,168 యూనిట్లను అమ్మినట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Saturday, June 4, 2011, 12:58 [IST]
English summary
Contry's fourth largest two-wheeler manufacturer Honda Motorcycle & Scooter India (HMSI), reported 6 percent increase in total sales for the month of May at 1,45,729 units. Similarly India's No. 3 two-wheeler maker TVS Motor Co, said its total sales in May rose over 18 percent on year to 185,930 units from 156,980 units a year ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+