లోపపూరిత విడిభాగాలు: హోండా సిబిఆర్ 250ఆర్ బైక్స్ రీకాల్

ఇదే విషయాన్ని మా డ్రైవ్ స్పార్క్ ప్రతినిధి ఒకరు స్థానిక హోండా మోటార్‌సైకిల్స్ డీలరును సంప్రదించి ధృవీకరించుకోవడం జరిగింది. ఈ విషయంపై సదరు డీలర్ స్పందిస్తూ.. కొత్త బ్యాచ్‌లో అమ్ముడైన హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్‌లలో బోల్టులు, నట్లు తుప్పు పడుతున్నట్లు ఫిర్యాదులు రావడం జరిగిందని, దీంతో ఈ బ్యాచ్‌లో అమ్ముడైన వియోగదారులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి పార్ట్‌లను ఉచితంగా మార్చి ఇస్తున్నామని తెలిపారు. మొదటి బ్యాచ్‌లో ఉత్పత్తి అయిన వాహనాల్లో తమ షోరూమ్‌లో సుమారు 100 హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌ల వరకూ విక్రయించామని ఆయన చెప్పారు.
ఇక హోండా సిబిఆర్ 250ఆర్ విషయానికి వస్తే.. హెచ్ఎమ్ఎస్ఐ నుండి అమ్ముడవుతున్న స్పోర్ట్స్/సూపర్ బైక్‌లలో ఇది చీప్ అండ్ బెస్ట్. ఇటీవలే ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం దీని ధర రూ.1.7 లక్షల వరకూ ఉంది. అటు లుక్‌లోనూ ఇటు పెర్ఫామెన్స్‌లో "అదుర్స్" అనిపించేలా హోండా దీన్ని డిజైన్ చేసింది. ఇదే సెగ్మెంట్లో బజాజ్ కవాసకి నుండి లభిస్తున్న నిన్జా 250కు ఇది గట్టిగా పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








