స్ప్లెండర్, ప్యాషన్‌ల జోరుకు హోండా 100 సీసీ బైక్‌‌తో చెక్

Honda CB Twistter
తమ భారత భాగస్వామి హీరో గ్రూప్ నుంచి విడిపోయిన తర్వాత జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా దేశీయ మార్కెట్లో తన సత్తా నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ టూ-వీలర్ మార్కెట్లోని అన్ని సెగ్మెంట్లలోనూ తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం హీరో హోండా అందిస్తున్న స్ప్లెండర్, ప్యాషన్ మోడళ్ల జోరుకు చెక్ పెట్టేందుకు ఓ 100 సీసీ బైక్‌ను ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) పేర్కొంది.

భారత మార్కెట్లో ప్రస్తుతం ఈ విభాగానికే (100 సీసీ సెగ్మెంట్) అధిక డిమాండ్ మరియు మార్కెట్ షేర్ ఉంది. ఈ మేరకు 100 సీసీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడం ద్వారా హోండా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన మార్కెట్లో హోండాకు 13 నుంచి 14 శాతం వాటా ఉంది. 100 సీసీ బైక్‌కు సంబంధించి మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే ఇది భారత రోడ్లపైకి రానుందని కంపెనీ ఆపరేటింగ్ హెడ్ (సౌత్, వెస్ట్) మకటో యోషీ తెలిపారు.

కాగా.. కంపెనీ ఇప్పటికే.. 110 సీసీ సెగ్మెంట్లో సిబి ట్విస్టర్ అనే బైక్‌ను అందిస్తోంది. అయితే దీనికి మార్కెట్ నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. హోండా కొత్తగా అభివృద్ధి చేస్తున్న 100 సీసీ బైక్, ఇదే విభాగంలో బజాజ్ అందిస్తున్న డిస్కవర్, ప్లాటినా మోడళ్లకు కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 19 లక్షల వాహనాలను విక్రయించాలని, అలాగే.. అంతర్జాతీయ మార్కెట్లలో 2 లక్షల యూనిట్లను ఎగుమతులను లఖ్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2011, 12:15 [IST]
English summary
India's fourth largest two-wheeler maker Honda Motorcycles & Scooters India Ltd said, it will launch their a new bike under 100cc motorcycle segment in India in coming months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+