హీరో 100 సీసీ బైక్‌లకు ధీటుగా హోండా 100 సీసీ బైక్

ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే ఓ ద్విచక్ర వాహనం హోండా నుంచి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ (రూరల్) మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ 100 సీసీ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. హీరో మోటోకార్ప్ మొత్తం అమ్మకాల్లో సగానికిపైగా రూరల్ మార్కెట్ల నుంచే వస్తుండటం గమనార్హం. గతంలో హీరో హోండా ప్రారంభంలో విడుదల 'సిడి 100' ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే హోండా తన కొత్త 100 సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా సిడి మోటార్‌సైకిల్ బ్రాండ్ నేమ్ హోండా సొంతం. అంతేకాదు, కొత్త లైసెన్సు ఒప్పంద ప్రకారం 2014 వరకు మాత్రమే సిడి బ్రాండ్‌ను హీరో ఉపయోగించుకునే అవకాశం ఉంది. హోండా కావాలనుకుంటే ఈ బ్రాండ్‌ను తిరిగి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. మరి ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న పోటీ వాతావరణంలో హోండా నిలబడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. కాగా.. 100 మోటార్‌సైకిల్ సీసీ సెగ్మెంట్లో ఇప్పటికే బజాజ్ నుంచి ప్లాటినా, డిస్కవర్, టీవీఎస్ నుంచి స్టార్, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు లభిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








