హీరో-హోండాల పోటీ: మూడో ప్లాంటు ఏర్పాటుకు హోండా రెడీ

అయితే మూడో ప్లాంటుకు సంబంధించి కేటాయిచిన పెట్టుబడి వివరాల గురించి మాత్రం హోండా వెల్లడించలేదు. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలోని తపుకరా వద్ద హోండా నిర్మిస్తున్న రెండో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రెండింతలకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం తపుకరా ప్లాంటు కోసం జపాన్‌కు చెందిన హోండా మోటార్ కార్పోరేషన్ పూర్తి భారతీయ అనుబంధ సంస్థ అయిన 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్స్ ఇండియా' (హెచ్ఎమ్ఎస్ఐ) రూ. 500 కోట్లను వెచ్చింది. ఈ ప్లాంటు జూన్ 1న ప్రారంభం కానుంది. తపుకరా ప్లాంటు ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల యూనిట్లు. మరోవైపు హీరో హోండా బ్రాండ్ విషయంలో ముంజాల్ ప్రమోట్ చేసిన హీరో గ్రూపు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
చైనా తర్వాత ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న రెండో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత మార్కెట్లో ఈ రెండు కంపెనీలు ఎవరికి వారు అగ్రగామిగా నిలవాలని పోటాపోటీగా అభివృద్ధి ప్రణాళికలకు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత రోడ్ల కోసం ప్రస్తుతం ఉన్న హీరో హోండా స్ప్లెండర్, ప్యాషన్‌లకు పోటీ ఇచ్చేందుకు హోండా కంపెనీ ఓ 100సీసీ బైక్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది. మరి కొద్ది సంవత్సరాల్లోనే మార్కెట్ లీడర్ ఎవరనే విషయం తేలనుంది. కాగా.. ప్రస్తుతం హోండా కంపెనీ భారత మార్కెట్లో డియో, ఆక్టివా, ఏవియేటర్ స్కూటర్లతో పాటుగా ట్విస్టర్, షైన్, స్టన్నర్, యునికార్న్, యునికార్న్ డాజ్లర్ మోటార్‌సైకిళ్లను మరియ స్పోర్ట్స్ బైక్ సిబిఆర్ 250ఆర్‌తో సహా మరో మూడు క్రూయిజ్ బైక్‌లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








