భారత్‌లో 30,000 సిబిఆర్-250ఆర్ బైక్‌ల విక్రయ లక్ష్యం: హోండా

ప్రస్తుత సంవత్సరం దేశీయ మార్కెట్లో 30,000 హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ధేశించికున్నామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎన్.కే రతన్ తెలిపారు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వేరియంట్ ధర రూ. 1.70 లక్షలు కాగా, స్టాండర్డ్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ వేరియంట్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్‌షోరూమ్, చెన్నై)గా ఉంది. ఇది ఆరు విభిన్న రంగులలో లభిస్తుంది. స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇది కవాసకి బజాజ్ అందిస్తున్న నిన్జాకు గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








