యునికార్న్ వెయిటింగ్ పీరియడ్‌ 6 నెలలకు పెంపు

Honda CB Unicorn
ద్విచక్ర వాహన విభాగంలో 150 సీసీ సెగ్మెంట్లో ఇటు పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్, మెయింటినెన్స్ వంటి ఫీచర్లతో ది బెస్ట్ బైక్ అనిపించుకుంటున్న 'హోండా యునికార్న్' మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవాలంటే ఇకపై కొనుగోలుదారులు ఆరు నెలల పాటు వేచి ఉండక తప్పదు. హోండా యునికార్న్ మోడల్‌కు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో దీని వెయిటింగ్ పీరియడ్‌ను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) లిమిటెడ్ కంపెనీ ఆరు నెలలకు పెంచింది.

కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన హోండా యునికార్న్ మోడల్‌ను కంపెనీ 2005లో విడుదల చేసింది. బజాజ్ ఆటో అందిస్తున్న పల్సర్, టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న అపాచీ మోడళ్లకు ఇది గట్టి పోటీను ఇస్తుంది. మోనో షాక్ అబ్జార్వర్ సిస్టమ్‌తో భారత మార్కెట్లో విడుదల తొలి బైక్ సిబి యునికార్న్ కావడం విశేషం. కాగా.. యునికార్న్‌లో విడుదల చేసిన మరో వేరియంట్ యునికార్న్ డాజ్లర్‌లో బ్లాక్, రెడ్ కలర్ బైక్‌లు 30 రోజుల్లో డెలివరీ అవుతుండగా, మెటాలిక్ గ్రే, గోల్డ్ కలర్ బైక్‌ల వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల వరకూ పడుతుంది.

అలాగే, స్కూటర్ సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా వెయిటింగ్ పీరియడ్ కూడా ఎన్నుకునే కలర్‌ను బట్టి రెండు నుంచి నాలుగు నెలల వరకూ సమయం పడుతోంది. యునికార్న్ డాజ్లర్ విడుదలతో యునికార్న్ మోడల్ ఉత్పత్తి నిలిచిపోతుందేమో అని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే... బైక్ లవర్స్ యునికార్న్ డాజ్లర్ కన్నా పాత వెర్షన్ యునికార్న్‌పై ఎక్కువ మక్కువ చూపుతుండటంతో ఆ మోడల్‌కు డిమాండు పెరిగింది.

ఈ నేపథ్యంలో యునికార్న్ ఉత్పత్తిని నిలిపివేయలేదని, వెయింటిగ్ పీరియడ్‌ను మాత్రమే పెంచామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాబట్టి యునికార్న్ మోడల్‌ను బుకింగ్ చేసుకున్న వారు దాన్ని సొంతం చేసుకునేందుకు ఆరు నెలలు ఆగక తప్పదు మరి.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 18:23 [IST]
English summary
Honda Motorcycles and Scooters India has increased the waiting period for its flagship model, 150cc bike CB Unicorn to six months due to the huge demand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+