ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ-గో కాన్సెప్ట్ ఆవిష్కరణ!

ఈ నేపథ్యంలోనే భావితరం ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన 'హుస్క్వార్నా' అనే మోటార్‌సైకిల్ కంపెనీ ఓ సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఈ-గో" (E-go) అనే అత్యంత తేలికైన, బ్యాటరీతో నడిచే ఓ మోటార్‌సైకిల్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరుగుతున్న ఆటో షోలో ఆవిష్కరించింది. ఈ మోటార్‌సైకిల్ బరువు 80 కేజీలు మాత్రమే.
ఈ మోటార్‌సైకిల్ మరొక ప్రత్యేక ఏంటంటే ముందువైపు "సింగిల్ సైడెడ్ డుబల్ లెగ్ ఫోర్క్", "సింగిల్ సైడెడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్"లు. పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రస్తుతానికి కాన్సెప్ట్‌కు మాత్రమే పరిమితం. ఇది వాస్తవ రూపం దాల్చడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








