ట్విన్ ఇంజన్ 250సీసీ బైక్‌ను లాంచ్ చేయనున్న హ్యోసంగ్

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్‌లో హ్యోసంగ్ బైక్‌ల కోసం గార్వారే మోటార్స్ ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎస్.పి రారుకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్‌లను సైతం ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ట్విన్ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిళ్ల భారత్‌లోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం హ్యోసంగ్ రాష్ట్ర విపణిలో అందిస్తున్న సూపర్‌బైక్‌ల ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* హ్యోసంగ్ జిటి 650ఎన్ ధర రూ.3,87,000
* హ్యోసంగ్ జిటి 650 ధర రూ.4,83,000
* హ్యోసంగ్ ఎస్‌టి7 ధర రూ.5,80.000
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా 100 సూపర్‌బైకులను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రారుకర్ తెలిపారు. తాము విడుదల చేయనున్న ట్విన్ ఇంజన్‌తో కూడిన సూపర్‌బైక్ ధర సుమారు రూ.2.25 లక్షలుగా ఉండనుందని, మహారాష్ట్రలో రూ.20 కోట్లతో నెలకొల్పిన యూనిట్‌లో హ్యోసంగ్ 650-700 సీసీ బైక్‌లను అసెంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








