హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్‌ను విడుదల చేసిన గార్వారే

భారత మార్కెట్లో హ్యోసంగ్ జిటి650ఎన్ ధర రూ.4.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని గార్వారే మోటార్స్ వెల్లడించింది. హ్యోసంగ్‌కు భారత్‌లో ఇది మూడవ సూపర్‌బైక్. గర్వారే మోటార్స్ మోటార్స్ గత ఏప్రిల్ నెలలో హ్యోసంగ్ జిటి650ఆర్, హ్యోసంగ్ ఎస్‌టి7 అనే రెండు సూపర్‌బైక్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. తాజాగా గార్వారే మోటార్స్ ప్రవేశపెట్టిన హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ 650సీసీ, వీ-ట్విన్ 8-వాల్వ్, డిఓహెచ్‌సి లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉండి, 72 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 196 కిలోల బరువు ఉండే ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 14 డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ మూడు రంగులలో మాత్రమే లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 300 హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం 325 బైక్‌లను విక్రయించింది. మార్చి 2012 నాటికి 1,200 విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.
ఈ సందర్భంగా గార్వారే మోటార్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హైదర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లో 250సీసీ బైక్‌లను కూడా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ప్రస్తుతం 14గా ఉన్న డీలర్‌షిప్‌ల సంఖ్యను 2012 చివరి నాటికి 50కు పెంచుకోవాలని యోచిస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








