భారత్‌లో రెండు హ్యోసంగ్ సూపర్‌బైక్స్ విడుదల

Hyosung Suoer Bikes
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎస్&టి మోటార్స్ భారత్‌లో రెండు సరికొత్త హ్యోసంగ్ బ్రాండ్ సూపర్‌బైక్‌లను విడుదల చేసింది. వీటిల్లో 650 సీసీ ఇంజిన్‌ గల "జీటీ650" సూపర్‌బైక్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిదాని ధర రూ. 4.75 లక్షలుగా ఉండగా... రెండోది రూ. 4.90 లక్షలుగా ఉంది. అలాగే.. 700 సీసీ ఇంజన్ కలిగిన మరో క్రూయిజ్‌ బైక్‌ "ఎస్‌టీ7" ధర రూ. 5.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్‌ న్యూఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. రానున్న 3-5 ఏళ్లలో హ్యోసంగ్‌ బ్రాండ్‌కు చెందిన అన్ని మోడళ్లను భారత్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ తైక్వాన్‌ కిమ్‌ తెలిపారు.

హ్యోసంగ్‌ షోరూమ్‌లను త్వరలో హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తొలి ఏడాదిలో 2,000 బైక్‌లు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. హ్యోసంగ్ గతం(2004)లోనే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2007లో హ్యోసంగ్ మోటార్ డివిజన్‌ను ఎస్&టి గ్రూపు కొనుగోలు చేసింది. కాగా.. ప్రస్తుతం భారత్‌లో ఏర్పాటు చేసిన తాజా వెంచర్ కోసం ఎస్&టి మోటార్స్ పుణేకి చెందిన గర్వారే మోటార్స్‌తో చేతులు కలిపి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. 20 కోట్ల పెట్టుబడితో గార్వారే మహారాష్ట్రలోని వాయ్ వద్ద అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు (సింగిల్ షిఫ్ట్‌లో) 8-10 బైకులు.

More from DriveSpark

Article Published On: Thursday, April 21, 2011, 11:12 [IST]
English summary
South Korean two-wheeler maker S&T Motors and its Indian partner Garware Motors has launched two Hyosung branded premium bikes for the Indian market. The 650cc superbike GT650R in two options for Rs.4.75 lakh and Rs.4.90 lakh. It has also rolled out a 700cc cruise bike, ST7, for Rs.5.69 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+