అక్టోబర్ నెలలో 27 శాతం పెరిగిన యమహా ఇండియా సేల్స్

దీనికితోడు పండుగ సీజన్ నేపథ్యంతో అక్టోబర్ నెలలో కూడా యమహా ఏమాత్రం జోరు తగ్గకుండా ద్విచక్ర వాహన విక్రయాలు సాగించింది. గడచిన నెలలో యమహా ఇండియా అమ్మకాలు 26.82 శాతం వృద్ధిని సాధించి 42,240 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 37,251 యూనిట్లుగా ఉన్న కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 31,791 యూనిట్ల నుండి 38,229 యూనిట్లకు పెరిగి 20.25 శాతం వృద్ధిని సాధించగా, ఎగుమతులు 5,460 యూనిట్ల నుండి 9,011 యూనిట్లకు పెరిగి 65.04 శాతం వృద్ధిని సాధించినట్లు యమహా తెలిపింది. పండుగ సీజన్ కారణంగా అమ్మకాల జోరు పెరిగిందని, భవిష్యత్తులో కూడా ఇదేవిధమైన అమ్మకాల జోరు కొనసాగుతుందని కంపెనీ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) జున్ నకటా తెలిపారు.


Click it and Unblock the Notifications