బజాజ్ పల్సర్ బైక్‌ల కోసం కె అండ్ ఎన్ ఎయిర్ ఫిల్టర్లు

కె అండ్ ఎన్ ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసుకొని మరళా ఉపయోగించుకోవచ్చునని, ఒక్కసారి ఈ ఎయిర్ ఫిల్టర్‌ను అమర్చుకుంటే మరళా మరళా ఎయిర్ ఫిల్టర్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మిలియన్ మైల్ లిమిటెడ్ వారంటీతో ఇవి లభిస్తాయని కె అండ్ ఎన్ పేర్కొంది.
2001 మోడల్ బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ నుండి 2011 మోడల్ బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ వరకూ వివిధ మోడళ్లు, వేరియంట్లుకు సరిపోయే విధంగా తమ వద్ద ఎయిర్ ఫిల్టర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
కె అండ్ ఎన్ ఎయిర్ ఫిల్టర్ల ఫీచర్లను పరిశీలిస్తే ఇవి....:
* వాషబుల్, రీయూజబుల్
* లైఫ్‌టైమ్ ఎయిర్ ఫిల్టర్
* హార్స్‌పవర్, యాక్సిలరేషన్‌ను పెంచేలా డిజైన్ చేయబడ్డాయి
* ఇన్‌స్టాల్ చేయడం చాలా సులువు
* సులవైన హై పెర్ఫామెన్స్ యాడ్-ఆన్
* అత్యుత్తమ ఫిల్టరేషన్‌తో కూడిన అధిక ఎయిర్ ఫ్లో
* కె అండ్ ఎన్ మిలియన్ మైల్ వారంటీ
* పర్యావరణ సాన్నిహిత్యమైనది


Click it and Unblock the Notifications








