హయోసంగ్ జిటి 650ఆర్ vs కవాసకి నిన్జా 650ఆర్
క్రూయూజ్ బైక్ 'కవాసకి నిన్జా 650ఆర్' ఉత్పత్తిని మహారాష్ట్రలోని ఛాకన్‌లో బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో ఉన్న కవాసకి మోటార్స్ వద్ద కంపెనీ ప్రారంభించింది. ఈ బైక్‌ను థాయ్‌లాండ్ నుంచి విడిభాగాలు (సికెడి)గా దిగుమతి చేసుకొని ఛాకన్ ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ చేస్తుంది. ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కొరియన్ కంపెనీ హయోసంగ్ విడుదల చేసిన "హయోసంగ్ జిటి 650ఆర్"కు కవాసకి నిన్జా 650ఆర్ గట్టి పోటీ ఇవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు. నిన్జా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు బజాజ్ ఆటో ఇప్పటికే దీని తయారీకి కావాల్సిన చాలా వరకూ విడిభాగాలను భారత్‌లోనే కొనుగోలు చేస్తుంది.
నిన్జా 650ఆర్ సూపర్‌బైక్ 650సీసీ ఫోర్-స్ట్రోక్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో పాటు సిక్స్-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 72 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తూ గంటకు గరిష్టంగా 204 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 5.5 లక్షలు ఉండొచ్చని అంచనా. త్వరలోనే ఈ సూపర్‌బైక్‌ను బజాజ్ ఆటో విడుదల చేయనుంది.
అయితే ఈ విభాగంలో ఇప్పటికే హయోసంగ్ విడుదల చేసిన "జీటీ650" సూపర్‌బైక్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది 650 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో 54.2 కెడబ్ల్యూల శక్తిని విడుదల చేస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 5.5 లక్షలుగా ఉంది. కవాసకి నిన్జా వేరియంట్‌లో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న 250 సీసీ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications








