తాతలు, బామ్మల డ్రైవింగ్‌లోనే పిల్లలు ఎక్కువ సేఫ్..!

Baby in Car
ఈ సృష్టిలో తాతా మనవళ్ల సంబంధం చాలా గొప్పది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు వారి తల్లిందండ్రులు కూడా పంచలేని ప్రేమను అవ్వ, తాతలు పంచుతారనడంలో పెద్ద ఆతిశయోక్తి లేదేమో. ఎందుకంటే ఆ పిల్లలే వారికి ఆస్తిపాస్తులు మరియు వారసులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకంటున్నామంటే.. పిల్లుల కారులో ఉండగా, వారి తల్లిదండ్రులు నడిపేటప్పుడు కన్నా వారి అమ్మమ్మలు, తాతయ్యలు నడిపేప్పుడే ఎక్కువ క్షేమంగా ఉంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

వాస్తవానికి వయసు మీద పడటంతో ముసలివాళ్లు డ్రైవింగ్‌పై పట్టుకోల్పోతారని అనుకుంటాం. కానీ ఇందుకు విరుద్ధంగా వారు డ్రైవ్ చేస్తున్నప్పుడే చిన్నపిల్లలు మరింత క్షేమంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. వివిధ కారు ప్రమాదాల్లో చిన్న పిల్లలు గాయపడిన సందర్భాలను లెక్కిస్తే.. వాటిల్లో ముసలివాళ్లు వాహనాలు నడిపిన సందర్భాల్లోనే గాయాలు తక్కవుగా నమోదవుతున్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం నిర్వహించిన డాక్టర్‌. ఫ్రెడ్‌ హెన్రిటిగ్ వెల్లడించారు. ఇతను ఫిలాడెల్ఫియా చిన్న పిల్ల ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌‌గా పనిచేస్తున్నారు.

ఈ అధ్యయనంలో తల్లితండ్రులు వాహన నడుపుతున్నప్పుడు 1.05 శాతం మంది పిలల్లు గాయాల బారిన పడగా, తాతయ్యలు, అమ్మమ్మలు వంటి వారు నడుపుతున్నప్పుడు 0.7 శాతం మంది పిల్లలు మాత్రమే గాయపడినట్లు తేలింది. ఈ గణాంకాలను బట్టి గమనిస్తే... ముసలివాళ్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదావకాశం 33 శాతం మేరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. 15 రాష్ట్రాల్లో 2003-07 మధ్య జరిగిన కారు ప్రమాదాలు రాష్ట్ర ఫార్మా ఇన్సూరెన్స్‌ క్లెయిముల ఆధారంగా డ్రైవర్లను ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలను రీసెర్చర్లు వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2011, 18:38 [IST]
English summary
State Farm Insurance new study show that children may just be safer with grandma or grandpa behind the wheel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+