నాలుగు కొత్త మోడళ్లతో రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఎల్ఎమ్ఎల్

LML Freedom
ఎల్ఎమ్ఎల్ ద్విచక్ర వాహనాల గురించి బైక్‌ లవర్స్‌కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం దాదాపు ఒక దాశాబ్ధం క్రితం వరకూ భారత మార్కెట్లో స్మార్ట్ లుక్‌, స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో బైక్‌లు స్కూటర్లను అందించిన ఎల్ఎమ్ఎల్ ఇప్పుడు తిరిగి దేశీయ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా ఉత్పత్తిని నిలిపివేసిన ఎల్ఎమ్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు కొత్త మోడళ్లతో దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి పునఃప్రవేశించాలని భావిస్తోంది.

మరికొద్ది నెలల్లోనే కాన్పూర్ హెడ్‌క్వార్టర్‌కు చెందిన కంపెనీ భారతదేశపు తొలి 200 సీసీ ఇంజన్‌తో గేర్లు కలిగిన స్కూటర్‌ను విడుదల చేయనుంది, దీని తర్వాత మరో 125 సీసీ గేర్లు లేని స్కూటర్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది సుజుకి యాక్సెస్ 125, మహీంద్రా డ్యూరో, రోడియో మరియు ఫ్లైట్ స్కూటర్లకు పోటీగా నిలువనుంది. అలాగే, ఒకప్పటి కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ అయిన ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ బైక్‌ను కూడా మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని 100 సీసీ, 125 సీసీ ఇంజన్‌లతో విడుదల చేయనుంది.

"2006లో సమస్యల్లో చిక్కుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు మేము విరామం తీసుకున్నామ"ని ఎల్ఎమ్ఎల్ సేల్ల్ అండ్ మార్కెటింగ్ హెడ్ పి.ఎస్. చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎగుమతులను ప్రారంభించామని, భారత్‌ కోసం నాలుగు మోడళ్లతో మార్కెట్లోకి వస్తున్నామని, తమ సొంత డిజైన్ మరియు టెక్నాలజీతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రీడమ్ బైక్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చౌదరి చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2011, 11:58 [IST]
English summary
LML the erstwhile scooter and bike manufacturer is set to re-enter the Indian market by launching several new models. It is going to begin by launching India's first 200cc geared scooter. This will be followed by a 125cc gearless scooter that will compete with the Suzuki Access125, TVS Wego and the Mahindra Rodeo. Company is also planning to relaunch the LML Freedom, which was its best selling motorcycle before it stopped operations in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+