స్కూటర్స్ ఇండియా వాటా కొనేందుకు మేమూ సిద్ధమే: లోహియా ఆటో

Lohia Auto
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన లోహియా గ్రూపు కూడా భారత ప్రభుత్వ ఆధీనంలో ఇన్న 95 శాతం స్కూటర్స్ ఇండియా వాటాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 500 కోట్ల టర్నోవర్ కలిగిన లోహియా గ్రూపు హస్తకళల ఎగుమతుల నుంచి వేర్‌హౌస్‌ల వరకూ వివిధ రంగాల్లో ఆసక్తిని కనబరుస్తుంది. అంతేకాకుండా.. ఈ గ్రూపుకు చెందిన కంపెనీ అయిన లోహియా ఆటో ఎలక్ట్రిక్ బైకులను తయారు చేసి విక్రయిస్తుంది. కాగా.. దివాళా తీసిన ప్రభుత్వం వాహన ఉత్పత్తి సంస్థ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌ (ఎస్ఐఎల్)లో ఉన్న మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించడానికి ఇటీవల క్యాబినెట్ పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే.

ఈ వాటలకు ప్రభుత్వం గనుక వేలం నిర్వహిస్తే తాము తప్పకుండా పాల్గొంటామని లోహియా ఆటో ఇండస్ట్రీస్ సీఈఓ ఆయుష్ లోహియా తెలిపారు. స్కూటర్స్ ఇండియా ప్రభుత్వానికి 95.38 శతాం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల వద్ద ఉంది. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్చి 2009లో కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది. బీఎస్‌ఈలో లిస్టయిన స్కూటర్స్ ఇండియా 2009-10 ఏడాదికి రూ. 22.03 కోట్ల నష్టాలను ప్రకటించింది.

కాగా.. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటితే రాజ్‌కోట్ కేంద్రంగా పనిచేస్తున్న అతుల్ ఆటో మరియు దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రేసులో ఉన్నాయి. స్కూటర్స్ ఇండియా సామర్థ్యం, టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అతుల్ ఆటో డెరైక్టర్ విజయ్ కేడియా పేర్కొన్నారు.

స్కూటర్స్ ఇండియా హిస్టరీ..
1972లో ఇటలీ లాంబ్రెట్టా కంపెనీతో ఒప్పందం చేసుకొని విజయ సూపర్‌ బ్రాండ్‌ పేరుతో స్కూటర్‌లను ఉత్పత్తి చేసిన స్కూటర్స్‌ ఇండియా కంపెనీ విదేశాలకు కూడా స్కూటర్లను ఎగుమతి చేసింది. ఆ తర్వాతి కాలంలో సొంత టెక్నాలజీ విక్రాంత్ పేరుతో త్రిచక్ర వాహనాల (ఆటోలు) ఉత్పత్తిని చేపట్టింది. 1997 తరువాత స్కూటర్ల తయారీని పూర్తిగా నిలిపివేసి కేవలం ఆటోల ఉత్పత్తికి పరిమితమైంది. అయితే ఇందుకు కావాల్సిన సామర్ధ్యం స్కూటర్స్ ఇండియా వద్ద లేకపోవడం, దానికి తోడు పాత టెక్నాలజీల వాడటం కారణంగా కంపెనీ మార్కెట్‌లో నిలదొక్కులేక పోవటంతో సిక్‌ ఇండిస్ట్రీగా మారి దివాళా తీసింది.

More from DriveSpark

Article Published On: Friday, May 27, 2011, 12:36 [IST]
English summary
Moradabad based Lohia group has shown keen interest in the proposed divestment of public sector Scooters India Ltd. And it has varied interests from handicraft exports to warehousing, manufactures and sells electric bikes. Further, the union cabinet had provided the green signal to sell the central governments entire stake in the loss making three wheeler manufacturer Scooters India Ltd.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+