మహీంద్రా స్కూటర్ల కొనుగోలుపై ఉచిత ఆఫర్లు..!

ఈ ఆఫర్లలో భాగంగా, ప్రతి మహీంద్రా టూవీలర్స్ ద్విచక్ర వాహనం కొనుగోలుపై ఉచి ఇన్సురెన్స్, వడ్డీ రహిత రుణ సదుపాయం, అధిక ఎక్స్‌ఛేంజ్ ధర వంటి ప్రోత్సాహకాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇవే కాకుండా.. స్పాట్ ఎక్స్‌ఛేంజ్, స్పాట్‌ఫైనాన్స్, స్పాట్ డెలివరీ, లో డౌన్‌పేమెంట్ సదుపాయాలను కూడా కంరపెనీ ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మహీంద్రా 2వీలర్స్ రోడియో 125, డ్యూరో 125, ఫ్లయిట్, కైన్ అనే నాలుగు స్కూటర్లను విక్రయిస్తుంది.
గతంలో కూడా మహీంద్రా 2వీలర్స్ తమ స్కూటర్ల కొనుగోలుపై పెట్రోల్ ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. మహీంద్రా రోడియో స్కూటర్ లో రెండు డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయితో కూడిన) వేరియంట్లను, డ్యూరో స్కూటర్‌లో సరికొత్త డిజెడ్ 125 వేరియంట్‌ను విడుదల చేసిన విషయం తెలిసినదే. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందజేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








