స్టాలియో లోపాల కారణంగా మోజో విడుదల వాయిదా..!

Mahindra Stallio
మహీంద్రా విడుదల చేసిన తొలి 100సీసీ మెటార్‌సైకిల్ "స్టాలియో" గేర్ బాక్స్‌లో సమస్యలు వస్తున్నట్లు కంపెనీకు ఫిర్యాదుల అందిన నేపథ్యంలో ఎట్టకేలకు మహీంద్రా దీనిపై స్పందించింది. స్టాలియోలో లోపాలను సవరించేందుకు కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మహీంద్రా కంపెనీ ఇటలీకు చెందిన డిజైన్ సేవల సంస్థ "ఇంజనీర్స్ ఇంజనీరింగ్"ను ఆశ్రయించనుంది. గత అక్టోబర్‌లో విడుదలైన స్టాలియోను విక్రయించేందుకు మహీంద్రా గ్రూప్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. గడచిన ఫిబ్రవరిలో కేవలం 46 మహీంద్రా స్టాలియో బైకులు మాత్రమే అమ్ముడయ్యాయి.

దీంతో కంపెనీ తాత్కాలికంగా స్టాలియో ఉత్పత్తిని నిలిపివేసి, క్లచ్, గేర్ పార్ట్‌ల సమస్యను పరిష్కరించిన తర్వాత మళ్లీ ఉత్పత్తిని పునఃప్రారంభింతనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మహీంద్రా విడుదల చేయాలనుకున్న 300 సీసీ ప్రిమీయం బైక్ "మహీంద్రా మోజో" విడుదలను కంపెనీ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. స్టాలియో నేర్పిన అనుభవంతో మోజోను ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వతే విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

మోటార్‌సైకిల్ మార్కెట్‌ను డామినేట్ చేస్తున్న హీరో హోండా, బజాజ్ గ్రూపులకు పోటీ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్ ద్విచక్రవాహన విభాగంలోకి స్టాలియో 10 సీసీ ద్వారా అడుగుపెట్టింది. కానీ స్కూటర్ విభాగంలో రాణించినంతగా.. మోటార్‌సైకిల్ విభాగంలో కంపెనీ రాణించలేకపోయింది. మహీంద్రా టూవీలర్ సెగ్మెంట్లో స్కూటర్లే 90 శాతం విక్రయం అవుతాయి. స్కూటర్ విభాగంలో సుజుకీ, హోండాల నుంచి మహీంద్రా గట్టి పోటీని ఎదుర్కుంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2011, 16:31 [IST]
English summary
Mahindra & Mahindra now rectifying of its 100cc motorcycle Stallio, for this Mahindra adopted an Italian design services firm Engines Engineering. Mahindra has been struggling to boost the Stallio sales volume ever since its launch in October 2010. Mahindra Stallio sold only 46 units in February 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+