నవంబర్‌లో స్టాలియో విడుదల, మరి మోజో ఎప్పుడు?

Mahindra Mojo
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్ (ఎమ్‌టిడబ్ల్యూఎల్) తొలిసారిగా తమ "స్టాలియో" 110 సీసీ మోటార్‌సైకిల్ ద్వారా అత్యంత గట్టి పోటీ ఉన్న ద్విచక్రవాహన మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

అయితే, స్టాలియో గేర్ బాక్స్‌లో సమస్యలు వస్తున్నాయంటూ వరుస ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ప్రస్తుతం ఈ బైక్‌లోని లోపాలన్నింటినీ సవరించి, కొద్దిగా మార్పులు చేర్పులు చేసి నవంబర్ విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని కంపెనీ అధికారు ఒకరు వెల్లడించారు.

హోండా సిబి ట్విస్టర్, టీవీఎస్ స్టార్ సిటీ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహీంద్రా టూ వీలర్స్ స్టాలియో 110సీసీ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాగా.. మహీంద్రా అభివృద్ధి చేస్తున్న 300సీసీ మోటార్‌సైకిల్ మోజోను ఎప్పుడు విడుదల చేసే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించ లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2011, 15:41 [IST]
English summary
Mahindra and Mahindra has announced it would be re-launching the Stallio motorcycle by November. The company had discontinued production of the Stallio following complaints of faulty parts. An official from Mahindra Two Wheelers is quoted to have said: “Stallio is expected to be in the market again by November this year.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+