స్కూటర్స్ ఇండియా వాటాలపై ఆసక్తిగాలేని మహీంద్రా!

కేంద్ర ప్రభుత్వం స్కూటర్స్ ఇండియా వాటాలను విక్రయించాలని ప్రకటించినప్పుడు ఈ వాటాల కొనుగోలు రేసులో అతుల్ ఆటో మరియు మహీంద్రా కంపెనీలు ముందున్నట్లు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 2009లో ఈ కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది. స్కూటర్స్ ఇండియాలో ప్రభుత్వానికి 95.38 శతాం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల వద్ద ఉంది.
స్కూటర్స్ ఇండియా 1972లో ఇటలీకు చెందిన లాంబ్రెట్టా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విజయ సూపర్ బ్రాండ్ పేరుతో స్కూటర్‌లను ఉత్పత్తి చేసిన స్కూటర్స్ ఇండియా కంపెనీ విదేశాలకు కూడా స్కూటర్లను ఎగుమతి చేసింది. అయితే, ఆ తర్వాతి కాలంలో స్కూటర్ల అమ్మకాలు పడిపోవడంతో తమ సొంత టెక్నాలజీ విక్రాంత్ బ్రాండ్ పేరుతో త్రిచక్ర వాహనాల (ఆటోలు) ఉత్పత్తిని చేపట్టింది. 1997 తరువాత స్కూటర్ల తయారీని పూర్తిగా నిలిపివేసి కేవలం ఆటోల ఉత్పత్తికి పరిమితమైంది.


Click it and Unblock the Notifications








