మహీంద్రా స్టాలియో మోటార్‌సైకిల్ గేర్‌బాక్స్‌లో సమస్యలు

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్, 2010లో గరిష్టంగా 3,350 స్టాలియో బైక్‌లు అమ్ముడు కాగా.. నవంబర్, 2010లో 2,759 యూనిట్లకు, డిసెంబర్, 2010లో 716 యూనిట్లకు, జనవరి, 2011లో 421 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన స్టాలియో ఈ ఏడాది జనవరి వరకూ కేవలం 5,135 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీనిపై మహీంద్రా స్పందిస్తూ.. ఈ సమస్య గురించి తమకు అవగాహన ఉందని త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ఖచ్చితంగా ఎన్ని వాహనాలు ఈ సమస్యకు గురయ్యాయో మాత్రం కంపెనీ వివరించలేదు. అంతేకాకుండా.. ఈ రీకాల్ విషయం గురించి మహీంద్రా తమ వినియోగదారులకు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో రీకాల్ విషయం సర్వసాధారంణంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. చిన్నకారు నానో మొదలుకొని పెద్ద పెద్ద లగ్జరీ కార్ల వరకూ చిన్న చిన్న లోపాల కారణం రీకాల్‌కు గురవుతున్నాయి.


Click it and Unblock the Notifications








