మార్పులు చేర్పుల అనంతరం మళ్లీ రీలాంచ్ కానున్న స్టాలియో!

హోండా సిబి ట్విస్టర్, టీవీఎస్ స్టార్ సిటీ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహీంద్రా అండ్ మహీంద్రా తన 110సీసీ ఇంజన్ స్టాలియోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించే నాటికే హోండా, టీవీఎస్ కంపెనీలు అగ్రస్థానంలో ఉండి మంచి బ్రాండ్ ఇమేజ్‍ను సంపాధించుకొని ఉండటంతో వీటి పోటీ ముందు స్టాలియో నిడబడలేకపోయింది. దానికి తోడు వరుస ఫిర్యాదులు రావడంతో ఈ మోడల్ అటకెక్కింది. ఆ సమయంలో స్టాలియో విక్రయాలను పెంచుకునేందుకు కంపెనీ, ఐదేళ్లు లేదా 50,000 కి.మీ వంటి వివిధ ఆఫర్లను ప్రకటించినా ఫలితం లేకపోయింది. మరి రీఎంట్రీ ఇస్తున్న స్టాలియో శభాష్ అనిపించుకుంటుందో లేదే చూడాలి.


Click it and Unblock the Notifications








